Friday, April 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం.. సొంత అన్నను చంపిన తమ్ముడు..

- Advertisement -
- Advertisement -

ప్రాణం తీసిన భూమి తగాదా… ఇబ్రహీంపట్నంలో దారుణం
సొంత అన్ననే చంపిన తమ్ముడు
తుర్కగూడ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం
ఇబ్రహీంపట్నం: భూమి తగాదాలో సొంత అన్ననే హత్యచేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ పరిదిలోని తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన సిఐ రామక్రిష్ణ, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కగూడ గ్రామానికి చెందిన కందాల నర్సింహ్మారెడ్డి అనే వ్యక్తి సర్వేనంబర్ 95లో సుమారు 5 ఎకరాల భూమి కలదు. తన భూమిలోనికి వెళ్ళెందుకు సరైనా దారి లేకపోవడంతో గత పది హేను సంవత్సరాల క్రితం తమ భూమిలోకి వెళ్లెందుకు 15గుంటల భూమిని ఇతర రైతుల వద్ద కొగునోలు చేశారు. కాగా నర్సింహ్మారెడ్డి తమ్ముడు జనార్ధన్‌రెడ్డి గత ఐదేళ్ళ క్రితం శ్రీరాములు అనే వ్యక్తి వద్ద 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నర్సింహ్మారెడ్డి తన సొంత భూమిలోనికి వెళ్ళెందుకు ఏర్పాటు చేసుకున్న రోడ్డుప్రక్కనే ఈ భూమిని కొనుగోలు చేశాడు.

రోడ్డు భూమి తనదేనని తన భూమిలోకి వస్తుందని గత కొన్ని రోజులుగా జనార్ధన్‌రెడ్డితో పాటు జంగారెడ్డి, శ్రీకాంత్‌లు తరుచుగా నర్సింహ్మారెడ్డితో గొడవకు దిగేవారు. ఇది తట్టుకోలేని నర్సింహ్మారెడ్డి కోర్టు నుంచి ఈ భూమిపై స్టే తీసుకువచ్చారు. ఇది తట్టుకోలేని జనార్ధన్‌రెడ్డితో పాటు అతని స్నేహితులు జంగారెడ్డి, వ్రీకాంత్‌లు డిసెంబర్ 3న తమ పొలంలోనికి వెళ్లె రోడ్డుపై హద్దు రాళ్ళు పాతారు. ఈ భూమిలో హద్దు రాళ్ళను తొలగించాలని నర్సింహ్మారెడి అడ్డుకోవడంతో అతన్ని విచక్షణారహితంగా చితక బాదారు.

అనంతరం తమ్ముడు జనార్దన్‌రెడ్డి గడ్డపారతో కట్టడంతో తీవ్రగాయాలైనా నర్సింహ్మారెడ్డిని కుటుంబ సభ్యులు, స్థానికులు నగరంలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో అక్కడ నుండి గాంధీ దావాఖానకు తరలించారు. గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ నర్సింహ్మారెడ్డి సోమవారం అర్థరాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై నర్సింహ్మారెడ్డిపై దాడి చేసిన జనార్దన్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్‌లను ఈనెల 5న రిమాండ్‌కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం సిఐ రామక్రిష్ణ తెలిపారు. మృతునికి బార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News