Home Default అన్నను చంపి… రెండేళ్లుగా పోలీసులకు దృశ్యం సినిమా చూపించారు….

అన్నను చంపి… రెండేళ్లుగా పోలీసులకు దృశ్యం సినిమా చూపించారు….

Man killed by brother in Drishyam style

తిరువనంతపురం: అన్నను చంపి ఇంట్లో పాతి పెట్టి పోలీసులకు రెండు సంవత్సరాల పాటు దృశ్యం సినిమా చూపించిన సంఘటన కేరళలోని కొల్లమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాజీ పీటర్ అనే వ్యక్తి మల్లాపూరమ్ జిల్లాలో పని చేస్తూ జీవనం సాగిస్తాడు. 2018లో ఓనమ్ పండుగ సందర్భంగా తన సొంతూరు ఏరూర్‌కు వచ్చాడు. తమ్ముడు షాజిన్ భార్య ఆర్యతో షాజీ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆర్య తన భర్తకు తెలియజేయడంతో షాజీని తన తల్లి, భార్యతో కలిసి తమ్ముడు హత్య చేశాడు. అనంతరం ఇంట్లో పెరట్లో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం మృతదేహం పాతిపెట్టిన స్థలంలో కాంక్రీట్ వేశారు. మర్డర్ గురించి ఎవరికీ చెప్పలేదు. షాజీ మల్లాపూరమ్ పని చేస్తూ ఇంటికి రావడం లేదని పలుమార్లు బంధువులు, చుట్టుపక్కల వాళ్లతో చెబుతుండేవారు. షాజీ కనిపించకపోవడంతో అతడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2018 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని కుమారుడి గురించి ఎందుకు వాకబు చేయడం లేదని ప్రశ్నించారు. వారు తెలియదని సమాధానం చెప్పడంతో వారిపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.