Thursday, November 7, 2024

వావి వరసలు తప్పి…. ప్రియుడ్ని సోదరుడితో చంపించి…

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఓ యువతి కామంతో వావి వరసలు తప్పి వరసకు సోదరుడిని ప్రేమించడంతో పాటు తన ప్రియుడ్ని హత్య చేయించిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేశాయి పేటకు చెందిన విజయ్, రాంకీ స్నేహితులుగా ఉన్నారు.  విజయ్ తో రాంకీ పెద్దనాన్న కూతురు ప్రేమలో పడింది. రాంకీ కుటుంబ సభ్యులు విజయ్ తో పెళ్లికి ఒప్పుకోలేదు. డాక్టర్స్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని తమ్ముడైన రాంకీతో యువతి శారీరక సంబందాన్ని కొనిసాగిస్తోంది. విజయ్ తో ప్రేమాయణం కొనసాగించినప్పుడు అతడితో ఫోటోలు దిగానని, వాటిని అతడు తన స్నేహితులకు పంపిస్తున్నాడని, అందకే అతడిని హత్య చేయాలని సూచించింది. జనవరి 4న విజయ్ ను రాంకీ తన ఇంటికి పిలిచిన అనంతరం ఇద్దరు కారులో బయటకు వెళ్లారు. గీసుకోండ సమీపంలోని తాటి వనంలో కల్లు తీసుకొని కాకతీయ కాలువ వద్దకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి కల్లు తాగారు. విజయ్ ముఖంపై రాంకీ పలుమార్లు గుద్ది అనంతరం కాలువలోకి నెట్టేశాడు. దీంతో విజయ్ కాలువలో కొట్టుకపోయాడు. జనవరి 7న గుర్తుతెలియని మృతదేహం సంగెం మండలం కొత్తగూడెం సమీపంలోని కాకతీయ కాలువలో కనిపించింది. అదే సమయంలో విజయ్ తల్లి తన తనయుడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమెను తీసుకెళ్లి మృతదేహం చూపించగా తన కుమారుడిదేనని వెల్లడించింది. విచారణ చేయగా నేరం వెలుగులోకి వచ్చింది. రాంకీని, అతడి సోదరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News