Home తాజా వార్తలు గడిసింగాపూర్‌ లో రోడ్డుప్రమాదం : వ్యక్తి దుర్మరణం

గడిసింగాపూర్‌ లో రోడ్డుప్రమాదం : వ్యక్తి దుర్మరణం

Man Killed In Road Accident At Gadisingapurవికారాబాద్‌ : పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్‌ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హోంగార్డు బాలాజీ ఘటనాస్థలికి బైక్ పై వెళుతుండగా,  అతడిని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు బాలాజీ స్వల్పంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.