Thursday, April 25, 2024

బాబోయ్ పెద్దపులి

- Advertisement -
- Advertisement -

Man Killed in Tiger Attack At Komaram Bheem District

 

యువకున్ని చంపి అడవుల్లోకి లాక్కెల్లిన టైగర్
తప్పించుకున్న మరో యువకుడు
కొమురంభీం జిల్లా దిగిడా గ్రామంలో ఘటన
భయం గుప్పిట గిరిజనులు, గొత్తికోయలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండ లం దిగిడా గ్రామంలో ఓ పెద్దపులి యువకుడిని పొట్టన పెట్టుకుంది. దిగిడా గ్రామాని చెందిన సీడాం విఘ్నేష్ (20)తన మిత్రునితో కలిసి మంగళవారం చేపల వేటకు వెళ్లిన సమయంలో ఇద్దరిపై పులి హఠాత్తుగా దాడి చేసింది. ఈక్రమంలో విఘ్నేష్‌ను చంపి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. కాగా విఘ్నేష్‌తో పాటు ఉన్న మరో యువకుడు గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు. ఇద్దరు యువకులపై పులి దాడి చేసిందన్న విషయం తెలుసుకున్న అటవీ శా ఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

కాగా పులి దాడిలో మృతి ఎందిన విఘ్నేష్ మృతదేహం కోసం గా లింపు చర్యలు చేపట్టగా అటవీప్రాంతంలో కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా దహేగాం మండలం దిగెడ వద్ద ఇద్దరు యువకులు దిగెడ సమీపంలో ఉన్న చెరువుకు చేపల వేటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ అనే యువకుడ్ని పులి అడవిలోకి లాక్కెళ్లింది. మరో యువకుడు భయంతో సమీప గ్రామంలోకి పరిగెత్తాడు. అతని తుంటి భాగంపై విపరీతంగా గాయాలు చేసింది. పులి చెర నుంచి తప్పించుకోలేక విఘ్నేష్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. పులి దాడితో చుట్టు ప్రక్కల గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గత నెలలోనే గుర్తించారు
గత నెల 12వ తేదీన ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి.

ఒకటే పులి ఉందా… మరొకటి ఉందా
ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా స్థానిక ప్రజలు అధికారులకు వివరిస్తున్నారు.

భయం గుప్పిట్లో దిగిడా గ్రామం
గ్రామానికి చెందిన విఘ్నేష్‌ను పెద్దపులి పొట్టన పెట్టుకున్న ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని వాపోతున్నారు.

ఈ టైగర్ మ్యాన్ ఈటర్ : అటవీ అధికారులు
మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడి ఘటనపై కొన్ని మీడియా సంస్థలు ఇది మ్యాన్ ఈటర్ టైగర్ అని మీడియా పేర్కొనడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. అది అవాస్తవమని అన్నారు. మహారాష్ట్ర అడవుల్లో ఆ పులిని ఇప్పటికే అక్కడ అటవీశాఖ కొద్ది రోజుల క్రితం బంధించి గోరెవాడ జూకి తరలించినట్లుగా తెలంగాణ అటవీశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, గత పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ అడవుల్లో పులి తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి తిరిగినట్లుగా ఆనవాళ్లు కనిపించాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Man Killed in Tiger Attack At Komaram Bheem District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News