Home జాతీయ వార్తలు మొబైల్ డేటా కోసం తమ్ముడిని చంపిన అన్న

మొబైల్ డేటా కోసం తమ్ముడిని చంపిన అన్న

Man Kills Brother For Exhausting Mobile Internet Data

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ డేటాకోసం ఓ అన్న తన తమ్ముడిని కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసులు కథనం ప్రకారం.. జోధ్ పూర్ కు చెందిన రామన్, రాయ్ అన్నాదమ్ములు. రామన్ కు తెలియకుండా అతడి మొబైల్ డేటాను తమ్ముడు రాయ్ వాడుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రామన్ తమ్ముడినితో గొడవకు దిగాడు. అదికాస్త మించడంతో కత్తితో ఛాతీపై పొడిచాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రాయ్ ను సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు.

Man Kills Brother For Exhausting Mobile Internet Data