Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పెన్షన్ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు…

పెన్షన్ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు…

murderఅమరావతి: కృష్ణా జిల్లాలోని చందర్లపాడు దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ కొడుకు తన కన్న తండ్రిని దారుణంగా గొంతునులిమి హత్యచేశాడు. మృతుడు షేస్ మహబూబ్ సాహెబ్ (73) పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్లాడు. తండ్రికి ఫించన్ డబ్బులు వచ్చిందని తెలుసుకున్న కుమారుడు శిలార్, తండ్రితో గొడవకు దిగాడు. ఆ డబ్బు ఇవ్వాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. మృతుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో తండ్రిపై పిడిగుద్దులు కురిపిస్తూ గొంతును నులిమే యత్నం చేశాడు.

ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వృద్దుడిని కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. జూలై 8వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తండ్రిపై దాడి చేస్తున్న సమయంలో దృశ్యాలను తీసిన మృతుడి కూతురు పోలీసులకు పంపిచారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Man Kills Father For Pension Money