Thursday, April 25, 2024

నమ్మించి ఎటిఎం నొక్కాడు… నిండా ముంచాడు

- Advertisement -
- Advertisement -
Man Money Theft for daughter marriage At Rajendra Nagar
కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బు చోరీ, దర్జాగా రూ.3.74 లక్షల తస్కరించిన ఘనుడు

రాజేంద్రనగర్: దృష్టిమరల్చి ఓ నిరక్షరాస్యుని ఎటిఎం కార్డు, పిన్ నంబర్ తస్కరించిన ఓ ప్రభుద్దు డు ఏకంగా రూ. 3.73 లక్షల పైచిలుకు నగదు డ్రా, షాపింగ్ చేసిన సంఘటన ఇది. ఆదమరిస్తే అంతే అని పోలీసులు పదేపదే చెబుతున్నా జనాల బుర్రలోకి ఎక్కక పోతే ఇలా నే జరుగుతుందని చెప్పడానికి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన రుజూవు చేస్తోంది. ఫిర్యా దు అందుకున్న తరువాత కేవలం మూడు రోజుల్లో చేధించిన ఈ కేసులు వివరాలను గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ నర్సింహాతో కలసి రాజేంద్రనగర్ ఏసీపీ అశోకచక్రవర్తి వెల్లడించారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. లక్షీగూడ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నంబర్ 16లోని 9వ ఇంట్లో పసునూరి విష్ణు కుటుంబం నివాసం ఉంటోంది. వృత్తిరీత్యా కా ర్మికుడు అయిన విష్ణు కుమార్తె పెళ్లి కోసం సంపాధించిన దానితో పాటు కూడబెట్టిన డబ్బు మైలార్‌దేవ్‌పల్లి ఆంధ్రాబ్యాంకులోని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆంధ్రా బ్యాంకు తమ ఖాతాదారుడైన విష్ణుకు ఎటిఎం కార్డు జారీ చేసింది. పెద్దగా చదువురాని విష్ణు గత నెల 25 తేదీ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఆ వరణలోని ఎటిఎం నుంచి నగదు డ్రా చేయడానికి వెళ్లాడు. ఎటిఎం నుంచి డబ్బు డ్రా చేయడానికి ఇబ్బంది పడుతున్న విష్ణును గమనించిన సమీపంలోని ప్రగతీ కాలనీలో నివా సం ఉండే విశాఖప్నటం వాసి అయిన కట్టెల మన్నుయాద వ్(30) తాను సాయం చేస్తానంటూ కార్డు తీసుకున్నాడు.

విష్ణు డ్రా చేయమని చెప్పిన డబ్బు డ్రా చేసిన మన్ను యాదవ్ బాధితుని అకౌంటర్‌లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ ఉండడం గమనించారు. దాంతో తన ఆంధ్రాబ్యాంకు ఎటిఎం కార్డును ఏమీ తెలియనట్లు విష్ణుకు వచ్చి పంపాడు. అనంతరం విష్ణు ఏటీఎం కార్డుతో పలు దఫాలుగా రూ. 2. 15 లక్షల డ్రా చేశాడు. అంతటితో ఆగని మన్ను యాద వ్ వివిధ షాపులతో పాటు మెట్రోలో రూ.1.62 లక్షల కొ నుగో ళ్లు చేశాడు. అయితే ఎటిఎం నుంచి నగదు డ్రా, షాపి ంగ్ చే సిన సమయాల్లో మేసేజ్‌లో తన ఫోన్‌కు వచ్చిన విష్ణు చదువు రాకపోవడంతో పట్టించుకోలేదు. ఈ నెల 25 పదే పదే మేసేజ్‌లు వస్తుండడంతో విషయాన్ని భార్యకు చెప్పడంతో ఆ మే సేజ్‌లు చూసిన భార్య బ్యాంకు ఖాతా నుంచి డ్రా అయినట్లు గుర్తించి లబోధిబోమంటు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి రావడంతో మూడు రోజు ల క్రితమే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన నర్సి ంహా వారిని పిలిపించుకుని వివరాలు అ డిగి తెలుసుకున్నా డు. వెంటనే క్రైం పార్టీ ఎస్సై కుమార్ గౌ డ్‌కు ఈ కేసు చేధి ంచి పేదవాడైన విష్ణుకు న్యాయం చేయాలని ఆదేశించాడు. దాంతో ఈ కేసులు ఛాలెంజ్‌గా తీసుకు న్న ఎస్సై కుమార్‌గౌ డ్ హెడ్ కానీస్టేబుల్ రాఘవరెడ్డి, కానిస్టెబుల్స్ టి.శ్రీనివాస్, భీమయ్య, యాదయ్య, రవిందర్‌తో పాటు మహిళా కానీస్టేబుల్ స్వర్ణకుమారి బృంధాన్ని అప్రమత్తం చేశాడు.

అనంతరం ఆంధ్రాబ్యాంకు వెళ్లి విష్ణు ఖాతాకు సంబంధించిన స్టేట్ మెంట్ తీసుకొని పరిశీలించాడు. వివిధ ఎటిఎంల నుంచి న గదు డ్రా చేసిన నిందితుడు తన వివరాలు తెలియకుండా జా గ్రత్త పడడ్డా. మెట్రోలో టీవీ ఇతర వస్తువులు షాపింగ్ చేసిన ట్లు ఉన్న స్టేట్‌మెంట్‌లోని పేమెంట్ ఆధారంగా అక్కడి వెళ్లి ఆ సమయం లో సిసి టీవీ ఫుటేజీలను పరిశీలించగా మన్నుయాదవ్‌పై అనుమానం వచ్చింది. దాంతో ఎంటిఎం సెంట ర్ల వద్ద సిబ్బందిని మఫ్టిలో రంగంలోకి దింపిన ఎస్సై పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న ఆంధ్రా బ్యాంకు ఎటిఎం నుంచి మరలా నగదు డ్రా చేయడానికి వచ్చిన మన్నుయాదవ్‌ను అ దుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పడంతో పాటు చేసిన నేరం అంగీకరించాడు. దాంతో అ తనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుని వద్ద నుంచి మంళసూత్రాలు, పట్టిలు, వెండి. బ ంగారు చైన్లు, చెవిరింగులు, వస్త్రాలు, 42 అంగులాల ప నాసానిక్ స్మార్ట్ టివి, లాగే జి బ్యాగు, మెట్రో షాపింగ్ కార్డుతో పాటు రెండు ఎటి ఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడుని త దుపరి విచారణ నిమిత్తం కో ర్టు అనుమతి కోరనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును కేవలం మూడు రోజుల్లో చేధి ంచిన పోలీ స్ సిబ్బందికి అ వార్డులు ఇవ్వాలని సైబరాబాద్ సీపీకి సిఫారసు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Man Money Theft for daughter marriage At Rajendra Nagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News