Home తాజా వార్తలు మామను చంపిన కోడలు

మామను చంపిన కోడలు

Man Murder In Nascal At Parigi In Vikarabadవికారాబాద్ : ప‌రిగి మండ‌ల పరిధిలోని న‌స్క‌ల్ గ్రామంలో శుక్రవారం రాత్రి  దారుణ ఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడ‌న్న కోపంతో మంగ‌మ్మ‌ అనే మహిళ త‌న ప్రియుడితో క‌లిసి మామ కిష్ట‌య్య‌(75)ను హ‌త్య చేసింది. మూడేళ్ల  క్రితం మంగ‌మ్మ భ‌ర్త న‌ర్సింహులు అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం మంగ‌మ్మ మ‌రో వ్య‌క్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై మంగమ్మను మామ కిష్ట‌య్య‌ పలుమార్లు మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న మామ కిష్ట‌య్య‌పై కోపం పెంచుకున్న కోడలు మంగమ్మ తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. పోస్టుమార్టం కోసం కిష్ట‌య్య‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంగమ్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసుల తెలిపారు.