Home తాజా వార్తలు న్యాల్కల్‌లో వ్యక్తి దారుణ హత్య

న్యాల్కల్‌లో వ్యక్తి దారుణ హత్య

Man Murder In Nyalkal At Sangareddyసంగారెడ్డి : జిల్లా పరిధిలోని న్యాల్కల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని కొందరు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది గ్రామంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాడు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న తూర్పాటి శంకర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శంకర్ పటాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం  న్యాల్కల్ లోని తన ఇంటికి వస్తుండగా గత ఏడాది హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు శంకర్ పై కత్తులతో దాడి చేశారు. దీంతో శంకర్ ఘటనాస్థలిలోనే చనిపోయాడు. జహీరాబాద్ రూరల్ సిఐ నాగేశ్వరరావు, హద్నూర్ ఎస్సై వినయ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం శంకర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శంకర్ హత్యపై కేసు నమోదు చేసి , నిందితుల కోసం గాలిస్తున్నట్టు సిఐ నాగేశ్వరరావు తెలిపారు.