Thursday, November 7, 2024

పిల్లర్ నంబర్ 248 వద్ద కత్తులతో పొడిచి హత్య

- Advertisement -
- Advertisement -

Man murder in Pillar no 248 in Rajendra nagar

హైదరాబాద్: రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలోని పిల్లర్ నంబర్ 248 వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులు పట్టుకొని వెంబడించారు. రాళ్లతో కొట్టి అనంతరం కత్తులతో పలుమార్లు దాడి చేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని మహ్మాద్ అబ్దుల్ కలీల్ గా గుర్తించారు. శంషాబాద్ డిసిపి ప్రకాశ్ రెడ్డి, ఎసిపి సంజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News