Home తాజా వార్తలు భూవివాదంలో ఒకరి దారుణ హత్య

భూవివాదంలో ఒకరి దారుణ హత్య

Man Murder In Raytu Gudem Tanda At Mahabubabadమహబూబాబాద్ : భూవివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కొత్తగూడ మండల పరిధిలోని రౌతుగూడెం తండాలో మంగళవారం చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా అంగోతు బాలు అనే వ్యక్తిపై బాబూలాల్, హత్తిరామ్ అనే వ్యక్తులు దాడి చేేశారు. తీవ్రంగా గాయపడిన బాలును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ఘటనతో తండాలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు హత్తిరామ్ ఇంటిని, అతడికి చెందిన ట్రాక్టర్ ను బాలు బంధువులు తగులబెట్టారు. తండాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.