Home తాజా వార్తలు సంగారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

Man Murder In Sangareddy Distగారెడ్డి : కంది మండలం మామిడిపల్లి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన పొలిమేర సాయిలు (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  పొలిమేర సాయిలు (45) సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని, శుక్రవారం రాత్రి ఇంట్లోనే సాయిలును దుండగులు గొంతు నులిమి చంపారని ఎస్ఐ వెల్లడించారు. మృతుడు సాయిలుకు భార్య శోభ, కూతురు దివ్య, కొడుకు పవన్‌కుమార్‌ ఉన్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సీఐ శివలింగం పరిశీలించారు. సాయిలు హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదని ఎస్ఐ చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం సాయిలు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుభాష్ తెలిపారు.