Home తాజా వార్తలు వివాహేతర సంబంధం… వ్యక్తిని నరికి చంపి…

వివాహేతర సంబంధం… వ్యక్తిని నరికి చంపి…

Man murder over Extramarital affair

 

వికారాబాద్: అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయపల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిమ్మాయిపల్లిలో గ్రామంలో కురువ లక్ష్మి, మల్లప్ప అనే దంపతులు నివిస్తున్నారు. లక్ష్మితో బురుగుపల్లి పవన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం బయటపడడంతో మల్లప్ప-లక్ష్మి దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పవన్‌ను మల్లప్ప నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు డిఎస్‌పి లక్ష్మినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు మల్లప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.