Home జోగులాంబ గద్వాల్ పూడూరు గ్రామంలో వ్యక్తి హత్య

పూడూరు గ్రామంలో వ్యక్తి హత్య

Man Murdered In Puduru Villageజోగులాంబ గద్వాల : గద్వాల మండల పరిధిలోని పూడూరు గ్రామం లో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.  దొడ్ల ( గుడిసెల ) విషయంలో వివాదం తలెత్తడంతో ప్రత్యర్థులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సదరు వ్యక్తిని హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోతుండగా, వారిపై మృతుడి వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.