Home జాతీయ వార్తలు నిందితుడి బెయిల్‌కు కోర్టు వింత షరతు

నిందితుడి బెయిల్‌కు కోర్టు వింత షరతు

man on bail must wash women's clothes

గ్రామం లోని మహిళల బట్టలు ఉచితంగా ఉతకాలి

పాట్నా : లైంగిక దాడికి యత్నించిన ఒక వ్యక్తికి బెయిల్ కోసం కోర్టు వింత షరతు విధించింది. నిందితుడు గ్రామం లోని మహిళల బట్టలు ఆరు నెలల పాటు ఉచితంగా ఉతకాలని షరతు విధించింది. అంతేకాదు ఆ బట్టలను ఇస్త్రీ చేసి ఇవ్వాలని, ఆ ఖర్చంతా నిందితుడే భరించాలని కూడా షరతులో పేర్కొంది. బీహార్ లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలస్ కుమార్‌కు బట్టలు ఉతకడమే వృత్తి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో లైంగిక దాడి యత్నం కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బెయిలు కోసం నిందితుడు పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు ఈమేరకు షరతులు విధించింది.