Home జాతీయ వార్తలు ఢిల్లీలో ప్రేమ జంటపై కాల్పులు

ఢిల్లీలో ప్రేమ జంటపై కాల్పులు

GUNన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంటపై ఓ యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఓ పార్క్ వెలుపల శనివారం సాయంత్రం జరిగింది. పార్క్ బయట సరదాగా ముచ్చటించుకుంటున్న ఓ ప్రేమ జంట వద్దకు 22 ఏళ్ల యువకుడు వచ్చి వాగ్వాదానికి దిగాడు. అది కాస్త ముదిరి కాల్పులకు దారి తీసింది. దీంతో తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో సదరు యువకుడు విచక్షణరహితంగా ప్రేమ జంటపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా బాధితులను కాజల్, జతిన్ సర్కార్‌గా గుర్తించారు. కాల్పులకు పాల్పడిన యువకుడిని సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుమారుడిగా పేర్కొన్నారు. తండ్రి సర్వీస్ గన్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.