Home జాతీయ వార్తలు 14 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం… మృతదేహాన్ని 90 కిలో మీటర్లు బైక్ పై తీసుకెళ్లి…

14 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం… మృతదేహాన్ని 90 కిలో మీటర్లు బైక్ పై తీసుకెళ్లి…

 

ముంబయి: 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తుండగా కేకలు వేయడంతో బాలికను హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని కండీవ్లీ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బైక్‌పై 90 కిలో మీటర్లు దూరం తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తొమ్మిదో తరగతి చదివే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి చావ్లీ ప్రాంతంలో నివసిస్తోంది. సదరు బాలిక అక్టోబర్ 1న అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు తన కూతురు కనిపించడంలేదని సమత నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసినా… ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వాళ్ల ఇంటి పక్కన ఉండే వ్యక్తికి చెప్పుల షాపు ఉంది. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై చెప్పుల షాపు నడిపే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో బాటిల్‌తో తలపై మోది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెప్పుల బ్యాగులో పెట్టి తన బైక్‌పై 90 కిలో మీటర్ల దూరంలో ముంబయి- అహ్మదాబాద్ జాతీయ రహదారిలోని తలసారి ప్రాంతనికి తీసుకెళ్లి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చివేశాడు. పోలీసులు అతడిపై అనుమానం రావడంతో తొలుత మొదటి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. కానీ అమ్మాయి ఫోన్ నంబర్‌కు నిందితుడు ఫోన్ కాల్స్ రాకపోవడంతో విచారించలేదు. నిందితుడి వద్ద ఉన్న రెండో సిమ్‌ను ట్రేస్ చేయగా అదే రోజు అతడు తలసారి ప్రాంతానికి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో నిందితుడిని పోలీసులు తనదైన శైలితో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీస్ అధికారి రాజు కస్బే తెలిపాడు.

 

Man Rape attempt on Girl dumps body by bike in MH,25-year-old arrested based on alternate mobile number he used at time of crime

 

Molest Kills Girl dumps body by bike