Home తాజా వార్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన వ్యక్తికి ఆరు నెలల జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన వ్యక్తికి ఆరు నెలల జైలు

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన యువకుడికి ఆరు నెలల జైలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ కూకట్‌పల్లి కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. మీయాపూర్ ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం…నేపాల్‌కు చెందిన డాన్ బహదూర్ బండేలా(25) నగరంలోని ఆర్‌సి పురంలోని బిహెచ్‌ఈఎల్,ఎంఐజిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన లింగంపల్లిలోని తారా నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి మోటార్ సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో కూడా మద్యంతాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా మారకపోవడంతో కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జైలు శిక్ష విధించింది.

Man Sentenced 6 months jail for drunken driving in Hyd