Home తాజా వార్తలు పోలీసుల నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయింది

పోలీసుల నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయింది

Panjagutta-PS– పోలీస్ స్టేషన్ ముందు అన్వర్ బందువుల ఆందోళన

సోమాజిగూడ : రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది.తన కు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు.పోలీసుల నిర్లక్షంతోనే బుధవారం హత్య జరిగిందని మృతుడు కుటు ంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో బుధవారం జరిగిన హత్యకు పంజాగుట్ట పోలీసులే ముమ్మాటికి కారణమని అన్వర్ కుటుంబ సభ్యులు ,బంధువులు గురువారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఏదుట మృత దేహంతో ఆందోళనకు దిగారు.దింతో పోలీస్‌స్టేషన్ పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఉండటంతో అన్వర్ బంధువులు ఆందోళన చెపట్టడం తో ఆక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారి స్థాయిలో అన్వర్ బంధువులు స్టేషన్‌కు రావడంతో భారిగా ట్రాఫీక్‌కు అంతరాయం ఏర్పడింది.అన్వర్ బంధువులు పోలీసులపై ఆరోపణలు చేయడంతో తీవ్ర చర్చనియాంశంగా మారింది.

ఈ నెల 22న అన్వర్ తనకు ప్రాణ హాని ఉందని ముందుగానే స్టేషన్‌లో ఎసై నాగరాజుకు ఫిర్యాదు చేసిన ఆతను పట్టించుకోకుండా నీకు ప్రాణ హాని ఉందని ఏమై నా ఆధారాలు ఉంటే చూపాలని ఎసై కోరాడని ఆన్వర్ కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం పిల్లలలకు మందులు తీసుకురావడానికి పంజాగుట్ట స్టేషన్‌వైపు వస్తే రియాసత్ ఆలి కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా అన్వర్‌పై దాడికి పాల్పడ్డాడని ,అన్వర్ చావు బతుకుల మద్య ఎసీపీ కార్యాలయం ,పోలీస్‌స్టేషన్ కు పరిగెత్తుకుంటు వచ్చాడని తెలిపారు.అయినప్పటికి పోలీసులు ఆతనిని రక్షించాల్సింది పోయి వారు అక్కడి నుంచి పరుగులు తీయడంతో అన్వర్ ప్రా ణాలు కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోయారు.

దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న పంజాగుట్ట పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉం టుందో అని ఆర్ధం చేసుకోవాల్సి వస్తుందని బందువులు ఆగ్రహం వ్యక్తం చేశా రు.అన్వర్‌కు ముగ్గురు అమ్మాయిలు ,నలుగురు అబ్బాయిలు ఉన్నారని వారి కు టుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.దింతో వారు ఎసీపీ తి రుపతన్న ,ఇన్‌స్పేక్టర్ లు వారికి నచ్చచెప్పి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ,నిందితునికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని హామినివ్వడంతో వారు అక్కడి నుంచి తరలివెళ్లారు.

Man stabbed to death near Panjagutta Police station