Home తాజా వార్తలు తల్లిని తిట్టిందని భార్యను చంపేశాడు

తల్లిని తిట్టిందని భార్యను చంపేశాడు

 

హైదరాబాద్: తన తల్లిని తిట్టిందన్న కోపంతో ఒక భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. రంగారెడి జిల్లా కడ్తల్ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఎనిమిది నెలల కిత్రం రజతికి సుబవత్ లక్ష్మణ్‌తో వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచి రజతి తన భర్తతో, అత్తగారితో గొడవ పడుతుండేది. భర్త హెచ్చరించినప్పటికీ ఆమె తన అత్తతో ఘర్షణకు దిగేది. మంగళవారం కూడా భర్త ముందే ఆమె అత్తగారితో గొడవ పడింది. దీంతో కోపం పట్టలేకపోయిన లక్ష్మణ్ ఇనుప గొలుసుతో ఆమె గొంతును నులిమి చంపివేశాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో అతను పరారయ్యాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు రజతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Man strangles wife to death over quarrel with mother, the incident took place at Kadthal village of Rangareddy district