Home తాజా వార్తలు నడి రోడ్డుపై తగలబెట్టడంతో… 5 కిలో మీటర్లు పరుగెత్తాడు…

నడి రోడ్డుపై తగలబెట్టడంతో… 5 కిలో మీటర్లు పరుగెత్తాడు…

Man walked 5 km with burn injuries

 

భువనేశ్వర్: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని తగలబెట్టడంతో కాలిన గాయాలతో జాతీయ రహదారిపై ఐదు కిలో మీటర్లు పరుగెత్తిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగాధర్ బహేరా అనే వ్యక్తి షేఖ్ బజార్‌లో నివసిస్తున్నారు. గంగాదర్ ఒక జనరల్ స్టోర్ నడిపిస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా సాపా గ్రామానికి వెళ్తుండగా దారి మధ్యలో అతడిని గుర్తు తెలియని దుండుగులు ఆపి తగలబెట్టారు. అనంతరం అతడి వద్ద బైక్, గోల్డ్, వ్యాలెట్ లాక్కున్నారు. దీంతో దుండగుల నుంచి తప్పించుకొని జాతీయ రహదారిపై ఐదు కిలో మీటర్లు పరుగెత్తాడు. అనంతరం స్పృహ తప్పి పడిపోవడంతో అతడిని వాహనదారులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. భువనేశ్వర్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంగాధర్ తమ్ముడు మాయధర్ ఫిర్యాదు మేరకు చౌడ్‌దార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.