Saturday, April 20, 2024

మన ఊరు-మన బడి ‘పాఠశాలలు నేడు ప్రారంభం’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మన ఊరు మనబడి కార్యక్రమంలో మొదటి విడతలో పూర్తయిన పనులను బుధవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో మంత్రులు కె.టి రామారావు, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను స్థానిక ప్రజా ప్రతినిధులు బుధవారం నుండి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాల్లో ఇప్పటివరకు పూర్తయిన పాఠశాలలను నియోజకవర్గాల పరిధిలో ఆయా జిల్లా మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. పనులు పూర్తియైన పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, హ్యాండ్ వాష్, సంప్, టైల్స్, డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డులు, డిజిటల్ పరికరాలు, కంపౌండ్ వాల్, డైనింగ్ హాల్ , కిచెన్ షెడ్ వంటి మొత్తం 12 రకాల ఆభివృధ్ది పనులు చేశారు.

ఆ పాఠశాలలకు నూతన రంగులు వేసి, అందంగా తీర్చిదిధ్ది, ప్రారంభానికి సిద్ధం చేశారు. రూ.7,289 కోట్లతో 12 రకాల మౌళిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించాలని ప్రారంభించిన మన ఊరు – మన బడి పథకం క్రింద రూ.7,289 కోట్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నది. పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం , కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్ అమర్చడం, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానల్స్, అధునాతన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. బడి పిల్లల భవితకు బంగారు బాటలు నిర్మించాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యా శాఖ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేశారు.

మన ఊరు – మన బడి పథకం క్రింద పాఠశాలల్లో పరిశుభ్రమైన త్రాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజన వసతి ఏర్పాట్లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పనులు సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధర్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు రోజు వారి సమీక్షలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News