మన తెలంగాణ/కమాన్‌పూర్‌ః
కమాన్‌పూర్ మండలం కిష్టంపల్లెకు చెందిన కొంతం సత్తయ్య(50) అనే వ్యక్తి ఆనారోగ్య కారణాలతో తీవ్ర మనస్థాపం చెంది మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కమాన్‌పూర్ ఎస్సై ఆది మధుసుదన్ రావు తెలిపిన కథనం మేరకు కొంతం సత్తయ్య గత ఏడాదిన్నర క్రితం గుండారం గ్రామంలోని వ్యవసాయ బావి మరమ్మత్తుల పనులు నిర్వహిస్తుండగా కాలు జారి కింద పడటంతో నడుముకు తీవ్ర గాయలయ్యాయి. ఆసుపత్రులో వైద్యం చేయించిన ఫలితం లేకపోవడంతో పాటు వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో చేతుల సహాయంతో మంచం పై నుండి లేవడానికి ఇంట్లో ఉన్న పై కప్పుకు చీర ముడివేసి సత్తయ్య చేతులకు అందేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రతి నిత్యం చీర సహయంతో మంచంపై నుండి లేచే సత్తయ్య మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇంటి దగ్గర ఉన్న ఎల్లయ్య అనే వ్యక్తి సత్తయ్య దగ్గరికి రాగ ఉరి వేసుకోని ఉండటం చుసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. మృతుడు సత్తయ్యకు భార్య శాంతమ్మ, కుమారుడు కుమార్, కుమార్తె రజితలున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆది మధుసుదన్ రావు తెలిపారు.
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహాత్య
- Advertisement -
- Advertisement -