Tuesday, February 7, 2023

‘అలాంటప్పుడు కలిసుండేం లాభం.. దేశాన్ని విడగొట్టండి..’

- Advertisement -

Manchu-Vishnuమంచు కుటుంబం అంటేనే సంచలనాలకు మూలం. ఆ కుటుంబ సభ్యులు తరుచూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మంచు విష్ణు సంచలన వ్యాఖలు చేశారు. జల్లికట్టు ఉద్యమం, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఏకంగా దేశాన్ని రెండు భాగాలుగా విభజించాలంటూ వ్యాఖ్యానించారు. విష్ణు తాజా చిత్రం ‘లక్కున్నోడు’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ర్టాలు నిర్ణయిస్తే.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఉత్తరాది కానీ, మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావడం లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం ఏంటి? కాబట్టి ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది అని వ్యాఖ్యానించాడు విష్ణు. అంతేకాక… తమిళులు జల్లికట్టు కోసం శాంతియుతంగా ఉద్యమం చేసినట్టు ఆంధ్రా యువత కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాలని.. అందుకు తన పూర్తి మద్దతు ఇస్తానని పేర్కొన్నాడు. అయితే దేశాన్ని విడగొట్టాలంటూ విష్ణు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాలు చేయడం కాదు… కాస్త తెలివిగా మాట్లాడాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles