* అమీన్‌పూర్‌లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణ కూల్చివేతలు
* నిన్న నకిలీ అనుమతులపై.. నేడు అక్రమ వెంచర్లపై అధికారుల పంజా
*అక్రమార్కుల్లో మొదలైన ప్రకంపనలు
* 14 ఎకరాల్లోని సెంతన్‌లో వెంచర్ నేలమట్టం
మన తెలంగాణ/అమీన్‌పూర్ : ఎట్టకేలకు పంచాయతీ అధికారులు జూలు విదిల్చారు. అనేక సమావేశ సందర్భాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధికారుల తీరుపై కన్నెర్ర చేసినప్పటికీ మీనమేషాలు లెక్కించిన అధికారులు నేడు నిద్రమత్తు వదిలారు. ఉన్నతాధికారులు మొట్టికాయలు వేస్తేగాని తమ కర్తవ్యం గుర్తుకువచ్చినట్టుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పంచాయతీ పరిధిలో వందలకొద్ది అక్రమ వెంచర్లు.. వేలకొద్ద్దీ అనుమతులులేని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు మాత్రం కుంభకర్ణుడిలా ని ద్రమత్తులో ఉండి ప్రభుత్వ ఖాజానాకు గండి కొడు తూ తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు ఉ న్నాయి. ఇంకా ఉపేక్షిస్తే ఊరుకునే పరిస్థితిలేదని గ మనించి చర్యలకు సిద్ధ్దపడ్డారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడమే కాకుండా అసలైన తిమింగలా లు సైతం తప్పించుకుంటున్నాయి. వెంచర్ మొదలవుతున్న తరుణంలోనే అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించినట్లైతే అమాయక చేపలు (మేస్త్రీలు) బలయ్యేవారు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కొనసాగుతున్న కూల్చివేతలు : అమీన్‌పూర్‌లో అక్ర మ నిర్మాణాల కూల్చివేతలు గురువారం కొనసాగా యి. మొదటిరోజు నకిలీ అనుమతులతో చేపట్టిన ని ర్మాణాలపై పంజా విసిరిన పంచాయతీ అధికారులు రెండోరోజు అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించా రు. జిల్లా అధికారుల ఆదేశాలతో ఈవోపిఆర్‌డి దేవదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో పోలీసుల బందోబస్తు సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. అ మీన్‌పూర్ నరేంద్రకాలనీ పక్కన 14 ఎకరాల విస్తీర్ణం లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంతన్ వెంచర్‌లో నిర్మాణం కొనసాగుతున్న దాదాపు 30 ఇళ్లను జెసిబిలతో నేటమట్టం చేశారు. ఈ కూల్చివేతల్లో అమీన్‌పూ ర్ కార్యదర్శి శ్రీనివాస్, సూల్తాన్‌పూర్ కార్యదర్శి మహేష్, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ జోరు కోనసాగేనా..? అక్రమ వెంచర్లపై అధికారు లు కొనసాగిస్తున్న వేట తుదివరకు కొనసాగేనా… లేక మధ్యలోనే తోకముడుస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గురువారం ఉదయం 11గంటలకు సెంత న్ వెంచర్‌లో కూల్చివేతలు చేపట్టిన పంచాయతీ అధికారులు దాదాపు మధ్యాహ్నం ఒకటింటి వరకు కొనసాగింది. భోజన విరామం తరువాత దాదాపు మరో నాలుగు అక్రమ వెంచర్‌లలో కూల్చివేతలు చేపడతామని స్వయానా మీడియాతో వెల్లడించిన పంచాయతీ అధికారులు ఉన్నట్టుండి తమ చర్యలకు ఉపక్రమించా రు. ఇసుకబావి వద్ద కొనసాగుతున్న వెంచర్‌తో పాటు మరిన్ని అక్రమ వెంచర్లను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న అధికారులు నిజం చేస్తారా… ఈ జోరు నీటిబుడగలేనా త్వరలోనే తేటతెల్ల అవుతుంది.