Home తాజా వార్తలు మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: మంత్రి హరీశ్

మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: మంత్రి హరీశ్

Minister Harish Rao

నంగునూరు: సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మామిడి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లాలో రైతులు 13.4వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారని తెలిపారు. గ్రేసింగ్ చేసి విక్రయిస్తే మామిడికి అధికధర వచ్చే అవకాశముందని సూచించారు. మామిడి రైతుకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎఫ్ సిసి ద్వారా ఏర్పాటు చేసిన బెనిషాన్ కంపెనీతో ఒప్పదం కుదుర్చున్నామన్నారు. దీంతో బెనిషాన్ కంపెనీ లాభంలో 50 శాతాన్ని రైతులు డివిడెంట్ గా పొందుతారని చెప్పారు. ఇప్పటికే 352 టన్నుల కూరగాయలు కొని బెనిషాన్ కంపెనీకి పంపించామని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాంలోనూ 25 టన్నుల కూరగాయలు కొన్నామని మంత్రి హరీశ్ తెలిపారు.

Mango farmers will get support price Says Minister Harish