Saturday, April 20, 2024

మనీష్ సిసోడియా ఇడి కస్టడీ 5 రోజుల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా ఇడి కస్టడీని మరో ఐదు రోజులపాటు కోర్టు పొడిగించింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సిసోడియా ఇప్పటికే అరెస్టయి జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. శుక్రవారం సిసోడియాను ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఎదుట హాజరుపరచగా ఆయన ఇడి కస్టడీని మార్చి 22 వరకు పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.

సిసోడియా కస్టడీని ఏడు రోజులకు పొడిగించాలని ఇడి కోరగా న్యాయమూర్తి 5 రోజుల పాటు పొడిగించడానికి అంగీకరించారు. రూస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలోపల, బయట భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిసోడియా కస్టడీ కాలంలో కీలక సమాచారం బయటకు వచ్చిందని, ఇతర నిందితులతో కలిపి ఆయనను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు ఇడి తెలిపింది. మాజీ ఎక్సయిజ్ కమిషనర్ రాహుల్ సింగ్, దినేష్ అరోరా, అమిత్ అరోరాలతో కలిపి సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందని ఇడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News