Friday, April 19, 2024

ఈ నెల 22 నుంచి మంజీరా నది పుష్కరాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాదిన గరుడగంగాగా పేరుగాంచిన మంజీరా నది పుష్కరాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు మంజీరా నదికి రెండవసారి రాబోతున్నాయి. తొలిసారి 2011లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరకాలం తర్వాత ఈ నెల 22న తిరిగి ప్రారంభం కానున్నాయి.మే 3వరకూ మంజీరా పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరం మొదలు కానుంది.

పుష్కర కాలం ఏడాది పాటు ఉంటుంది. మొదటి 12రోజులు ఆది పుష్కరం అని,చివరి 12 రోజులు అత్యపుష్కరం అని పిలుస్తారు. ఈ సమయాలలో పుష్కరుడు సకల దేవతలతో వచ్చి నదిలో ఉంటాడని ,పుష్కరకాలంలో మంజీరా నది స్నానం వల్ల సకల తీర్థాలతో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని వేద పుండితులు చెబుతున్నారు. మెదక్ జిల్లా పేరూరు గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ఉన్న ఆలయంలో సరస్వతి అమ్మవారు కొలువుదీరారు. పేరూరు సమీపాన గరుడగంగతీరాన12రోజుల పాటు జరిగే మంజీరా నది పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తొనుకులు కొడుతున్న మంజీరా :
తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నది పుష్కర శోభను సంతరించుకుంటోంది. మంజీరా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిలువ నీటితో తొణుకులు కొడుతున్నాయి. ఈ ఏడాది మంజీరా నదికి ఎగువ నుంచి గణనీయంగా వరద ప్రవాహాలు వచ్చాయి. గత ఏడాది జూన్‌నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరం ఈ ఏడాది మే నెలతో ముగియ నుంది. ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 76.96టిఎంసీల వరద నీటిని మోసుకువచ్చింది. సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధం 29.91టిఎంసీలు కాగా, గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1717.93అడుగులు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1709.83అడుగుల నీటి మట్టం వద్ద 18.75టిఎంసీల నీరు నిలువ ఉంది. సింగూరు రిజ్వాయర్ నుంచి కాలువలకు 270టిఎంసీల నీటిని విడుదల చేస్తుండగా, ఇతర అవసరాలకు మరో 380టిఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో 11.16 టీఎంసీల ప్లడ్ కుషన్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది వేసవిలో ఇదే సమయానికి సింగూరు ప్రాజెక్టులో 22.42టిఎంసీల నీరు నిలువ ఉండేది.
నిజాంసాగర్‌లో 5.30టిఎంసీల నిలువ
మంజీరా నదికి చివరి ప్రాజెక్టుగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 17.80టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1392.58అడుగుల నీటిమట్టం వద్ద 5.30టిఎంసీల నీరు నిలువ ఉంది. రిజర్వాయర్ నుంచి కాలువకు 169క్యూసెక్కులు , ఇతర అవసరాలకు 558క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి నిజాంసాగర్ ప్రాజెక్టులో 1395.54అడుగుల నీటిమట్టం వద్ద 7.25టిఎంసీల నీరు నిలువ ఉందేది. ఈ నీటిసంవత్సరం మంజీరా నది ద్వారా నిజాం సాగర్ జలాయశంలోకి 106టిఎంసీల వరద నీరు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News