Home తాజా వార్తలు సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా క‌డ‌వేర్గు మంజుల

సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా క‌డ‌వేర్గు మంజుల

Manjula Elect As Siddipet Municipal Chairpersonసిద్దిపేట : సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా క‌డ‌వేర్గు మంజుల‌, వైస్ చైర్మ‌న్‌గా జంగిటి క‌న‌క‌రాజు పేర్లను అధికార టిఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో మంత్రి హరీశ్ రావు, ఎన్నికల పరిశీలకులు రవీందర్ రావు, ఓంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు సమావేశం నిర్వహించి , చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 36 వార్డుల్లో విజయం సాధించింది. బిజెపి 1 స్ధానంలో విజయం సాధించగా, ఇత‌రులు 6 స్థానాల్లో గెలుపొందారు. టిఆర్ఎస్ రెబ‌ల్స్ మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో  గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.