Home తాజా వార్తలు ‘మ‌న్మ‌థుడు2’ సినిమా టీజర్ రిలీజ్

‘మ‌న్మ‌థుడు2’ సినిమా టీజర్ రిలీజ్

'Manmadhudu2'హైదరాబాద్ : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా ’మన్మథుడు‘. ఈ సినిమా నాడు ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ’మన్మథుడు2‘ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత అందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్  పూర్తికావొచ్చింది. ఈ సినిమా టీజ‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతోంది. చాలా కాలం తరువాత  నాగార్జున ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అల‌రించ‌నున్నాడు. ఆగ‌స్ట్ 9న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

‘Manmadhudu2’ Movie Teaser Release