Thursday, April 25, 2024

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మనోజ్ సిన్హా

- Advertisement -
- Advertisement -

Manoj Sinha as Lieutenant Governor of Jammu and Kashmir

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త గవర్నర్ ను గురువారం నియమించారు. కొత్తగా నియమితులైన లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2019-19 మధ్య కేంద్రమంత్రిగా భాధ్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్‌ సిన్హా ఐఐటి వారణాసి నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆయన బెనారస్‌ హిందూ యూనివర్సిటీ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బిజెపిలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News