Friday, March 29, 2024

మసకబారిన నియామకాలు

- Advertisement -
- Advertisement -
ManpowerGroup Employment Outlook Survey
15 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు : సర్వే

న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా దేశీయంగా నియామకాలు 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయని సర్వే వెల్లడించింది. అంతే కాదు, ఈ సంక్షోభం మరికొన్ని నెలలు కొనసాగుతుందని సర్వే చెప్పింది. కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే వచ్చే మూడు నెలల్లో నియామకాలకు ప్లాన్ చేస్తున్నట్టు 800 సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం, ఈ ఏడాది చివరి త్రైమాసికంలో నియామకాల విషయమై దేశ వ్యాప్తంగా 813 సంస్థలు పాల్గొన్నాయి.

దీని లో 7 శాతం సంస్థలు మాత్రమే పేరోల్స్‌లో పెరుగుదల సంకేతాలు ఇవ్వగా, 3 శాతం తగ్గిస్తామని చెప్పాయియ 54 శాతం యథాతథ స్థితిని అంచనా వేశాయి. వాస్తవానికి, 800 మందికి పైగా ఉద్యోగులపై నిర్వహించిన ఒక సర్వేలో, కేవలం మూడు శాతం కంపెనీలు మాత్రమే రాబోయే మూడు నెలల్లో కొత్త వారిని నియమించుకునే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాయి. సర్వే ప్రకారం, మధ్య తరహా సంస్థలు కొంత పెరుగుతాయని, పెద్ద సంస్థల్లో తక్కువ ఉద్యోగాలు ఉంటాయని భావిస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా కంపెనీలు తమ శ్రామిక శక్తిని తగ్గించాయి. అయితే ప్రస్తుత డిమాండ్ కారణంగా నియామకాలు ఉంటాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి అన్నారు.

ManpowerGroup Employment Outlook Survey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News