Friday, April 26, 2024

అమేథీలో 5 లక్షల ఎకె-203 రైఫిల్స్ తయారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అమేథీలోని కోర్వాల వద్ద ఐదు లక్షల ఎకె-203 రైఫిల్స్‌ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ రంగానికి చెందిన ఆయుధాల తయారీ హబ్‌గా ఉత్తర్ ప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణ రంగంలో విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి స్వస్తి చెప్పి మేకిన్ ఇండియాగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని వర్గాలు తెలిపాయి. రష్యా భాగస్వామ్యంతో ఎకె-203 రైఫిల్స్ తయారీ జరుగుతుందని, రక్షణ రంగంలో భారత్-రష్యా మధ్య భాగస్వామ్యం బలపడేందుకు ఇది దోహదపడుతుందని వారు చెప్పారు.

ఈ ప్రాజెక్టు వివిధ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఇ) ముడి సరుకులు, విడి పరికరాల సరఫరా చేయడానికి వ్యాపార అవకాశాలు కల్పిస్తుందని, అంతేగాక కొత్త ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని వారు తెలిపారు. 7.62X39ఎంఎం క్యాలిబర్‌తోకూడిన ఎకె-203 రైఫిల్స్ ప్రస్తుతం భద్రతా దళాల వాడుకలో ఉన్న ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు వారు చెప్పారు. ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ పేరిట ఏర్పాటు చేసిన స్పెషల్ పర్సస్ జాయింట్ వెంచర్‌లో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతుంది.

Manufacture 5 lakh AK-203 rifles in Amethi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News