Home వరంగల్ రూరల్ దంపతుల దారుణ హత్య

దంపతుల దారుణ హత్య

  Many suspicions about the murder of the couple

మన తెలంగాణ/వరంగల్ క్రైం/ హసన్‌పర్తి:  అన్నె పున్నెం ఎరుగని వృద్ధ దంపతులు పొట్ట కూటి కోసం కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వృద్ధ దంపతులను కళ్లల్లో కారం చల్లి, కత్తులతో అతికిరాతకంగా చంపిన వైనం హసన్‌పర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గడ్డం దామోదర్ (55), గడ్డం పద్మ (50) దంపతులు గత కొన్ని ఏళ్లుగా కిరాణం షాపు నడుపుకుంటున్నారు. వీరికి సంతానం ఒక కుమారుడు పున్నం చందర్, ఇద్దరు కుమార్తెలు ఉదయ శ్రీ, కరుణ శ్రీలు ఉన్నారు. వీరిలో కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యో గం చేయగా కుమార్తెలు ఒకరు యుకెలో, మరొకరు, హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు. అయితే ఇదే క్రమంలో కిరాణ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తూన్న వృద్ధ దంపతులు సోమవారం రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా దంపతుల దారుణ హత్య తలుపుల శబ్ధం వినపడడంతో ఉల్కిపడి లేసిన దంపతులపై ఒక్కసారిగి దోపిడి దొంగలు కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేయగా గడ్డం పద్మ అరుస్తు ఇంట్లో నుండి ఆరు బయటకు ఉన్న బాత్‌ర్రూంలోకి పరుగులు తీయగా గమనించిన దుండగులు బాత్ రూంలోనే కారం చల్లి కత్తులతో గొంతు కోసి అతికిరాతకంగా చంపారు. బెడ్‌పై నిద్రిస్తున్న దామోదర్‌ను కత్తులతో మెడను కోసి చంపారు. మంగళవారం ఉదయం 7.30 సమయం అయినప్పటికిని గడ్డం దామోదర్, పద్మలు కిరాణం షాపు తెరువక పోవడంతో పక్కనే ఉన్న హోటల్‌కు చెందిన యజమాని రోజు వారి లాగా కిరాణం షాపు ఇంకా తీయలేదని అనుమానంతో గేటు వద్దకు వెల్లి పిలువగా ఎలాంటి చప్పుడు చేయ్యక పోవడంతో పక్కనే ఉన్న దామోదర్ సోదరుడు సత్యనారాయణ గేటు లోపలికి దూకి చూడగా బాత్ రూంలో రక్తపు మడుగులో పద్మను చూసి వెంటనే దగ్గరలో ఉన్న హసన్‌పర్తి పోలీసులకు సమా చారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
దంపతుల హత్యపై పలు అనుమానాలు
ఎవరికి ఎలాంటి హాని చేయ్యని వృద్ధ దంపతులపై నగర ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిరాణం షాపు నడుపుకుంటూ జీవిస్తున్న దంపతులను అతికిరాతకంగా కత్తులతో గొంతు కోసి చంపాల్సిన అవసరం ఎమిటని కొంత మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి దంపతుల గొంతు కోసి ఎందుకు చంపారు. దోపిడి దొంగలైతే దంపతులను కట్టేసి దొంగతనం చేసి ఉండవచ్చుకదా… దోపిడి దొంగలైతే కత్తులతో ఇంట్లోకి చొరబడటం ఎంటని మరి దుండగులు పద్మ బట్టలను ఊడతీసి గొంతును కోసిన చంపిన సంఘటన కనబడుతుందని.. హసన్‌పర్తి లో ఇలాంటి అతికిరాతకమైన సంఘటనను ఎప్పుడు చూడలేదని, ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు తెలిసిన వారే ఇటాంటి పని చేసి ఉంటారన పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
పలు కోణాల్లో ధర్యాప్తు చేస్తున్న పోలీసులు
అర్ధ రాత్రి జరిగిన దంపతుల హత్య పై పోలీసులు మంగళవారం ఉదయం వరంగల్ పోలీస్ కమీషనర్ రేట్ నగర పరిధిలోని పోలీసుల సంఘటన స్థలానికి చేరుకోని ధర్యాప్తు చేస్తున్నారు. దంపతులను పక్క ప్లాన్‌తోనే హత్య చేసి ఉంటారా.. లేక దంపతుల ఇంట్లో దోపిడికి పాల్పడేందుకు వస్తే… అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చంపి ఉంటారా..లేదా రోజు కిరాణం షాపు వద్దకు వచ్చే వ్యక్తుల పనేనా… లేకా బాగా తెలిసిన వారే ఇంతటి పనికి పాల్పడివుంటారా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డిసిపి వెంకట్‌రెడ్డి, క్రైం డిసిపి అశోక్ కుమార్, ఎసిపి సత్యనారాయణ, సిఐలు పుల్యాల కిషణ్, రవికుమార్, అజయ్‌కుమార్, సతీష్ కుమార్, ఎస్‌ఐలు రాహూల్ గైక్యాడ్, సుధాకర్, నాగబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వృద్ధ దంపతులు కావడంతో దొంగలు హత్య చేసి ఉంటారు- సిపి:
వృద్ధ దంపతులుగా జీవినం కొనసాగిస్తున్న దంపతులను హత్య చేసిని దుండగులు ఒంటరిగా ఉన్నారనే నేపధ్యంలో తలచి ఇలాంటి దోపిడికి పాల్పడి ఉంటారని ఎంతటి వారినైన విడిచి పెట్టే ప్రశక్తిలేదన్నారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిగా దుండగులను ప్రత్యేక బలగాలతో, జాగిలాలతో, డాగ్ క్కీం, క్లూజ్ టీ, క్రైం టీమ్, ఇంటలిజెన్స్ టీమ్‌లతో పాటు పలు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సీసి పుటేజీలను పరిశీలించి అతి త్వరలో నేరస్తులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటలను మల్లి పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతామని వృద్ధ దంపతులుగా జీవిస్త్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పక్క ప్లాన్ తోనే హత్య:
సోమవారం అర్థరాత్రి జరిగిన దంపతుల హత్య పక్క ప్లాన్ తోనే హత్య చేసి ఉంటారినే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘట స్థలాన్ని పరిశీలిస్తే దంపతులను కావల్సుకొనే చంపి ఉంటారు. దోపిడికి వచ్చిన దుండుగులు కత్తులతో ఎందుకు వస్తారు. దోపిడి చేసేందుకు వచ్చిన దుండుగులు వీరి ఇంట్లోకే ఎందుకు వచ్చారు. ఒంటరిగా వీరే ఉన్నారని దొంగలకు ఎలా తెలుసు… దోపిడికి వచ్చిన దొంగలు పక్క ప్లాన్‌తో కారం పోడి తీసుకోని వచ్చారు. అదే కాకుండా ఇంట్లో డబ్బులు, బంగారం కూడ ఎక్కడ ఉంటాయని తెలిసిన విధంగా దోపిడిని చేశారు. దోపిడికి వచ్చిన దుండగులు దోపిడి చేసి వెళ్లాలి… కాని బాత్ రూంలోకి తీసుకొని బట్టలను విప్పి మరి ఎందుకు చంపి ఉంటారు. ఇంతటి సంఘటను గుట్టు చప్పుడు కాకుండా చేసిన దుండగులు తెలిసిన వారే పక్క ప్లాన్‌తోనే హత్య చేసి ఉంటారన్న వైనం కనిపిస్తుంది.