Saturday, April 20, 2024

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ములుగు: ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ 2వ సిఆర్సీ- ఏ సెక్షన్ కమాండర్ నుప భీమా అలియాస్ సంజు, అతని భార్య ముచ్చకి దుల్దో అలియాస్ సోని ఎసిఎం దంపతులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌పి డాక్టర్ శబరీష్, ఒఎస్‌డి అశోక్ కుమార్ ఎదుట గురువారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్‌పి మావో దంపతుల లొంగుబాటుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నుప భీమా అలియాస్ సంజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, బూర్గుపాడులో కూలీగా పనిచేసేవాడు.

ఆ క్రమంలో చర్ల ప్రాంతానికి చెందిన సోడి జోగా మిలీషియా కమాండర్ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని 2019లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ విప్లవాత్మక సిద్ధాంతాలను వివరించి పార్టీలో చేరడానికి ప్రేరేపించాడు. నుప భీమా పార్టీలో చేరి, చర్ల ప్రాంతంలోని మిలీషియా సభ్యునిగా పనిచేసి 2వ సిఆర్‌సి కమాండర్ అన్నె సంతోష్ అలియాస్ సాగర్‌తో కలసి విప్లవాత్మక జీవితాన్ని గడిపాడు. మూడేళ్లు పనిచేసి, నవంబర్ 2022లో సెక్షన్ కమాండర్, ఏసిఎంగా పదోన్నతి పొందాడు. అతని భార్య ముచ్చకి దుల్దో అలియాస్ సోని కూడా 2018లో యుజి అయ్యింది. తర్వాత 2వ సిఆర్‌సి కమాండర్ అన్నే సంతోష్ అలియాస్ సాగర్ నాయకత్వంలో 2వ సిఆర్‌సిలో చేరి డిసెంబర్ 2022లో పిపిసిఎం, ఎసిఎంగా పదోన్నతి పొందింది.

మావోయిస్టు దంపతులు తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న వివక్ష నచ్చక మావోయిస్టుల అగ్రనేతలు కిందిస్థాయి కేడర్ సభ్యులకు అందించే ఆహారంలో వివక్ష ఉండటం, పార్టీలోని మహిళా క్యాడర్ సభ్యులను లైంగికంగా వేధించడానికి అగ్రనేతలు అలవాటు పడడ్డారు. వీటన్నింటినీ మించి ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

వీరిపై బీజాపూర్ జిల్లా, ఎల్మిడి పిఎస్ పరిధిలో చెచ్చిరాకు మడుగులో జరిగిన ఎదురు కాల్పుల సంఘటన, ఫిబ్రవరి 2022లో బీజాపూర్ జిల్లా, బాసగూడ పిఎస్ పరిధి తిమ్మాపూర్ పుట్కేల్ దాడిలో ఇద్దరు సిబ్బంది మరణించిన సంఘటన, జాగురుగొండ ఏరియాలో కుండేడ్ జాగురుగొండ దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించిన సంఘటన, 20021 ఏప్రిల్‌లో జరిగిన టెర్రామ్ దాడిలో 26 మంది పోలీసు సిబ్బంది మరణించిన సంఘటనలో నిందితులు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. సమాజంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి జనజీవన స్రవంతిలో చేరాలని కోరారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు ప్రోత్సాహకంగా నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి నలువాల రవిందర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News