Home జాతీయ వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఎన్ కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఎన్ కౌంటర్

Encounterఛత్తీస్‌గఢ్‌ : బిరభట్టి అటవీ ప్రాంతంలో డిఆర్‌జి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడని సుక్మా ఎస్ పి శాలబ్‌ సిన్హా మీడియాకు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టు మద్కం హిజ్మాపై రూ. లక్ష రూపాయల రివార్డు ఉందని ఆయన వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉండడంతో డిఆర్‌జి పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Maoist Encounter In Chhattisgarh