Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

Maoist killed in encounter at bhadradri kottagudem

 

భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనెల్లి అడవుల్లో ఎదురుకాల్పులు
కొనసాగుతున్న గాలింపు చర్యలు

మన తెలంగాణ/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా చర్ల మండల పరిధిలోని కుర్ణపల్లి, బోదనెల్లి అడవుల్లో తుపాకులు మరోసారి మార్మోగాయి. ఆదివారం నాడు పోలీసు బలగాలకు, మావోయి స్టులకు ఎదురు కాల్పులు జరగ్గా, ఇందులో ఒక మావోయిస్టు మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించిన వివరాల ప్రకారం మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు చర్ల మండలంలో విధ్వంస చర్యలకు పూనుకున్నట్లు అందిన సమాచారంతో అడవుల్లో కూంబింగ్ చేపట్టినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.

ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడపడుతున్న తరుణంలో చర్ల మండల పరిధిలోని కుర్ణపల్లి, బోదనెల్లి అడవుల్లో పది మంది సాయుధలైన మావోయిస్టులు తరాస పడగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఎస్పీ వెల్లడించారు. కాల్పుల అనంతరం ఆ ప్రాం తాన్ని పరిశీలించగా ఓ మావోయిస్టు సభ్యుడి మృతదేహంతో పాటు 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులు లభించాయి. ఇంకా కూంబింగ్ చర్య లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఎదు రుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు వివరా లు తెలియాల్సి ఉంది.

భయాందోళనల్లో సరిహద్దు గ్రామాలు
చర్ల మండల పరిధిలో పోలీసులకు, మాయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులతో సరిహద్దు అటవీ గ్రామాల ప్రజలు ఉలికిపడ్డారు. గత కొన్నాళ్లుగా నిశ్శబ్ధంగా ఉన్న సరిహద్దుల్లో ఆదివారం చోటుచేసుకున్న ఎదురుకాల్పులు అలజడి పుట్టిస్తున్నాయి. మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు సోమవారంతో ముగియనుండడంతో ఈలోపు మావోయిస్టులు ఎలాంటి విధ్వంస చర్యలకు పాల్పడతారోనని సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

Maoist killed in encounter at bhadradri kottagudem