Friday, April 26, 2024

మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Maoist Party Militia Members Arrested in Khammam

దుమ్ముగూడెం: 2017 సంవత్సరం నుంచి మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యుడిగా ఉంటూ వారి ఆదేశాలపై పర్ణశాల పరిసరా ప్రాంతాలలో విప్లవ కరపత్రాలను అంటించాడానికి వచ్చి స్థానిక పోలీసులకు దొరికి అరెస్ట్ అయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఏఎస్సై సత్యనారాయణ పోలీస్‌సేష్టన్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి పర్ణశాల గ్రామ శివారుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి గుడ్డ సంచి పట్టుకొని అనుమానాస్పదంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులను చూసి ఆ వ్యక్తి పారిపోతుండగా వెంబండించి పట్టుకొని విచారించారు.

విచారణలో తన పేరు రవ్వ ఉంగయ్య (20) అని, చర్ల మండలంలోని బక్కచింతలపాడు గ్రామం అని అతను పోలీసులకు చెప్పాడు. 2017 సంవత్సరం నుంచి మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నానని తెలిపాడు. మావోయిస్టులకు అవసరమైన సరుకులను సరఫరా చేస్తున్నానని చెప్పాడు. మావోయిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు చట్టవ్యతిరేకమైన విప్లవ నినాదాలతో కూడిన కరపత్రాలను పర్ణశాల పరిసర ప్రాంతాలల్లో అంటించడానికి డిసెంబర్ 30వ తేదిన వచ్చానని చెప్పి నేరం ఒప్పుకున్నాడు. వెంటనే అతని వద్ద నుంచి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విప్లవ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రవి కుమార్ కేస్ నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News