Home Default అనారోగ్యంతో ఆర్కే మృతి : మావోయిస్టు పార్టీ

అనారోగ్యంతో ఆర్కే మృతి : మావోయిస్టు పార్టీ

Maoist RK Dies With Illness : Maoist Partyహైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్టు  మావోయిస్టు పార్టీ ధ్రువీకరించింది. ఈ మేరకు శుక్రవారం మావోయిస్ట్ పార్టీ ఓ ప్రకటన  చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలిపారు.  కిడ్నీలు విఫలమై ఆర్కే మృతి చెందినట్టు వారు వెల్లడించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేకు  చికిత్స అందించినప్పటికీ, తనను రక్షించుకోలేకపోయామని మావోయిస్ట్ అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌ కూడా తెలిపారు. డయాలసిస్‌ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే చనిపోయాడని ఆయన వెల్లడించారు.