Home రాష్ట్ర వార్తలు జిల్లా సరిహద్దుల్లో మావోల బీభత్సం

జిల్లా సరిహద్దుల్లో మావోల బీభత్సం

ph

ఇన్‌ఫార్మర్ నెపంతో గొత్తికోయను నరికి చంపిన మవోయిస్ట్‌లు
ఐదు లారీలు, రెండు ట్రాక్టర్‌లు, ఒక జెసిబి కాల్చివేత
జయశంకర్ భూపాలపల్లిలో ఘటన, మావోల పేరుతో లేఖలు

మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావు పేటలోని ఇసుక క్వారీ సమీపంలో శుక్రవారం ఆర్దరాత్రి మవోయిస్ట్‌లు బీబత్సం సృషించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి….. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేటలో నివాసం ఉంటున్న వలస గొత్తి కోయ గత కొంత కాలంగా పోలీస్ ఇన్‌ఫార్మన్‌గా వ్యవహరిస్తున్నాడని మడవి జోగయ్య(42)ను అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన తెల్లం రమేష్‌పై కాల్పులు జరిపారు. అనంతరం గ్రామ సమీపంలోని ఇపు క్వారీ వద్దకు చేరుకుని రెండు ట్రాక్టర్‌లు, ఐదు లారీలు, ఓక జేసీబీని దహనం చేశారు అనంతరం మడవి జోగయ్య, రమేష్ లపేరుతో కరపత్రాన్ని వదిలి వెళ్ళారు.
తెల్లం రమేష్‌నే ఇన్‌ఫార్మర్ అయినందునే చంపాం
తెల్లం రమేష్‌ను పోలీస్ ఇన్‌ఫార్మర్ అయినందునే చంపామని సీపీఐ మావోయిస్ట్ మణగూరు ఏరియా పేరుతో కరపత్రాన్ని కరపత్రాన్ని విడిచారు. తెల్లం రమేష్ చత్తీస్‌ఘడ్ సుక్మాజిల్లాలో చందా గ్రామంలో రమేష్ గతంలో ప్రజా వ్యతిరేక విధానాలు చేట్టడం వల్ల తన గ్రామస్తుల మందే అతనిని శిక్షించామన్నారు. గ్రామంలో ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ గ్రామస్తులను కొడుతూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేశాడన్నారు. అనంతరం ప్రజల సమక్షంలో దేహ శుద్ది చేస్తే అక్కడినుండి పారిపోయి వచ్చి పినపాక మండలం సుందర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడని వివరించారు. ఇక్కడ సీపీఎం పార్టీలో చేరి పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడని అన్నారు. పార్టీ కార్యకర్తగా గిరిజన గూడేల్లోకి వెళ్లి గిరిజనులను పోలీస్ ఇన్‌ఫార్మర్‌లుగా మారుస్తు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుండడంతో హతమార్చామని పేర్కొన్నారు. అనంతరం ఇసుక క్వారీ వద్ద మరో కరపత్రాన్ని వదలి వెళ్లారు కరపత్రాలలోని విషయాలు ఇలా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తల పెడుతున్న ఫాసిస్ట్ నిర్బాందాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 5న తెలంగాణ దండకారణ్యం బంద్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్షంతో గ్రీన్ హంట్‌లో భాగంగా సమదాన్‌పహార్ 2 పేర్లతో పార్టీపై, ప్రజలపై కొనసాగిస్తున్న పాసిస్టు దాడికి వ్యతిరేకంగా తలపెట్టిన మంద్‌ను అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యాపారులువిద్యార్థులు ఉదోయగులు పూర్తి మద్దత్తును ఇస్తూ విజయ వంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మవోయిస్ట్‌లు చేపట్టిన కార్యక్రమాలతో అటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క సారిగా అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్థబ్దుగా ఉన్న గ్రామాలు భయందోళన మద్యన .జీవనాన్ని సాగిస్తున్నాయి.