Home జాతీయ వార్తలు మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు..!

మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు..!

naxals-torched-image-done-iముజఫర్‌నగర్ : బిహార్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఓ నిర్మాణ సంస్థకు చెందిన 14 వాహనాలు, భవన నిర్మాణ సామగ్రికి నిప్పంటించారు. ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుందని చెప్పారు. దాదాపుగా 50 మంది మావోయిస్టులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోకి ఒక్కసారిగా వచ్చి అక్కడ బీభత్సం సృష్టించారని చెప్పారు. హరి కనస్ట్రక్షన్ కంపెనీ అక్కడి తుర్కీ రైల్యే స్టేషన్ వద్ద రైల్యే లైను డబ్లింగ్ పనులు చేస్తోందని చెప్పారు. ముజఫర్ నగర్ జంక్షకి ఈ స్టేషన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందనిన చెప్పారు. ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సీనియర్ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ రణజీత్ కుమార్ మిశ్రా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంస్థ భద్రత కల్పించారని చెప్పారు.