Thursday, April 25, 2024

అరణ్యంలో తుపాకి చప్పుళ్ళు

- Advertisement -
- Advertisement -

Maoists call for Telangana bandh on September 28

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలు తూపాకి చప్పుళ్ళుతో దద్దరిల్లిపోతున్నాయి. వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే చర్ల మండలంలో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ నెల 7న పూసుగుప్ప, వద్దిపేట గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన మరవకముందే ఈనెల 23 రాత్రి చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరికొంత మంది మావోయిస్టుల తప్పించుకున్నరానే సమాచారంతో ప్రత్యేక పోలీసులు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో యుద్ద మెఘాలు అలుముకున్నాయి. ఏ క్షణాణ ఏం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు కునుకు లేని రాత్రులను వెల్లదిస్తున్నారు.

నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.

చర్ల మండలంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లతో పాటు కడంబ, దేవర్లగూడ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ను తలపెట్టిటంది ఇందులో భాగంగా 25 తారీఖున మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేసింది. ఇదిలా ఉంటే బంద్ నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికికోసం ఏదైనా అవాంచనీయ ఘటనలకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు కొత్త వ్యక్తుల రకాపోకలపై ఆరా తీస్తున్నారు. అంతరాష్ట్ర మార్గలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు మావోయిస్టుల ఏరివేతే లక్షంగా పోలీసు ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతాల్లో గాలింపులు చర్యలు కొనసాగిస్తున్నాయి. వారం క్రితం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకోవాలంటు పిలుపునించిన మావోయిస్టులు మళ్ళీ బంద్‌ను తలపెట్టడడం పోలీసులకు సవాల్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏజెన్సీలో భయం…భయం

ఒవైపు మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపులు.. మరోవైపు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో యుద్ద మేఘాలు అలుముకున్నాయి. చర్ల మండల పరిదిలో గత కొంత కాలంగా పోలీసులకు, మావోయిస్టుల మధ్య నెలకొంటున్న వరుస సంఘటనలో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనల మధ్య కాలం వెల్లదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News