Wednesday, April 24, 2024

సామ్రాజ్యవాద దళారుల సృష్టి కరోనా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ విప్లవాత్మకమైన వాతావరణంలో 17వ వార్షికోత్సవం జరుపుకోబోతోందని, కేంద్రం చేపట్టిన సమాధాన్‌కు గట్టిగా బదులిస్తామని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల క్రితం పార్టీ ప్రతినిధులు, పిఎల్‌జిఏ, ఇతర బాధ్యులకు విప్లవాభినందనలు తెలిపినట్లు వివరించారు. తప్పుడు కేసుల్లో అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారన్నారు. 17వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు చారుమజుందార్, కన్హయ్యచటర్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు యాపా నారాయణ, పూర్ణెందు శేఖర్, ముఖర్జి, ఇతరులకు నివాళలర్పించారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, విజయాలు, వైఫల్యాలను ఎదుర్కొని కన్హయ్య చటర్జీ, చారుమజుందార్‌లు 57 ఏళ్లపాటు పీపుల్స్ వార్‌ను కొనసాగించారన్నారు. పీపుల్స్ వార్ ద్వారా పీపుల్స్ లోకల్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని, గతకొన్ని సంవత్సరాలుగా గట్టి సంకల్పంతో పార్టీని అన్నిరకాల పాసిస్టు శక్తుల నుంచి వారి సామ్రాజ్యవాద యజమానులు నుంచి రక్షించుకుంటున్నామన్నారు. ప్రజా ఉద్యమాలు అణచడానికి చత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 19న సుకుమా జిల్లాలోని బొట్టల్లంక గ్రామంలో మొదటిసారి డ్రోన్‌లతో దాడి చేశారని వివరించారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మావోయిస్టులు డ్రోన్‌లతో రెక్కీ చేశారంటూ గోబెల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రహార్-3 ఇవన్ని చేస్తోన్న ప్రయత్నాలని, గత నాలుగేళ్లుగా ప్రజలు సమాధాన్‌ను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని అభయ్ పేర్కొన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిని బ్రాహ్మణవాద హిందుత్వ ఫాసిస్టు పాలకవర్గాలు తీవ్రంగా అణిచివేస్తున్నాయన్నారు. ప్రజల జీవనం దుర్భరంగా మారుస్తున్నారని, మావోయిస్టు పార్టీ అణచివేతకు గురైన వారి విముక్తి మార్గం సుగమం చేస్తొందన్నారు.
రైతుల రాజీలేని పోరాటం
గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు రాజీ లేని పోరాటం చేస్తున్నారని, బస్తర్‌లో గిరిజనులు కార్పొరేటీకరణకు, కార్పెట్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. జార్ఘండ్‌లో పిత్రాండ్‌బ్లాక్ గిర్దిహ్ జిల్లాలో మహిళలు పోలీసు క్యాంప్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, షాహిన్‌బాగ్, సింఘీ, టిక్రి, గాజిపూర్, కడియామెట్ట పోరాటాలు ప్రజలకు నమూనాగా నిలిచిపోతాయని, ఇవన్నీ పాలక వర్గాలు నిర్వహిస్తోన్న ఆజాదికా అమృత్ మహోత్సవ్‌ను, డొల్లతనాన్ని బయట పెడుతున్నాయన్నారు. మావోయిసు పార్టీ పనితీరును, విధివిధానాలు పాటించాలన్నారు. సెంట్రల్ కమిటీ కొత్త డాక్యుమెంట్ తయారీతో పాటు కొత్త నాయకత్వం కోసం ఎన్నిక, పార్టీ బలోపేతానికి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బయటకు కనిపించని రహస్య శతృవును ఎదుర్కొనేందుకు పార్టీని ఉక్కు సంకల్పంతో బలోపేతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వస్తొన్న విప్లవానుకూల పరిస్థితులు ఉపయోగించుకోవాలని హితవు పలికారు. బ్రాహ్మణవాద హిందూ ఫాసిస్టు శక్తులు సామ్రాజ్యవాద దళారులకు సేవలో తరిస్తు, నకిలీ దేశభక్తిని నూరిపోస్తున్నాయన్నారు. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే ఎజెండాను ముందుకు తెస్తున్నారన్నారు. దేశంలో సామ్రాజ్యవాదుల దళారులు కరోనా పేరుతో వ్యాక్సిన్ అమ్ముకునేందుకు చేస్తోన్న కుట్రలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు బలహీన పడుతున్నాయన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా విముక్తి అణగారిన వర్గాల ప్రజలు ముందుకురావాలని 17వ వార్షికో త్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.

Maoists Release letter on Party 17th Anniversary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News