Home జాతీయ వార్తలు చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత

చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత

Maoists Vehicles burned in Chattisgarh borders

మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోలు గురువారం తీవ్రంగా రెచ్చిపోయారు. సరిహద్దుల్లో రోడ్డు పనులు చేస్తున్న ఎనిమిది వాహనాలను తగులబెట్టి, గుత్తేదారు హరిశంఖేర్ సాహు (40)ను హత్య చేశారు. సుక్మా జిల్లా డోర్నపల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిస్మా గ్రామ సమీపంలోని పిఎంజి రోడ్డు పనులు నిర్వహిస్తున్న గుత్తేదారుని మావోలు చుట్టుముట్టి దారుణంగా మారణాయుధాలతో హత్య చేశారు. ఈ దాడితో ఆగకుండా అక్కడున్న వాహనాలన్నింటినీ పూర్తిగా తగులబెట్టారు.
దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోలు, పోలీసుల మధ్య కాల్పులతో పాటు వాహనాలను తగులబెట్టడంతో ఆ ప్రాంత వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మావోలు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నికలను భహిష్కరించాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఈ దాడులు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మున్ముందు ఈ ప్రాంతంలో ఏ ఘటనలు చోటు చేసుకుంటాయో అని భయాందోళనతో జీవనం కొనసాగిస్తున్నామని గిరిజనులు తెలిపారు. ముందస్తుగా దాడులు జరుగకుండా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు.

Maoists Vehicles burned in Chattisgarh borders

Telangana News