Home తాజా వార్తలు మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే ఆత్మహత్య

మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే ఆత్మహత్య

Marathi Actor Ashutosh Bhakre Commits Suicideముంబయి : మరాఠీ నటుడు అశుతోష్ భక్రే బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్ లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని చనిపోయాడు. కొంతకాలంగా అశుతోష్ భక్రే డిప్రెషన్ తో బాధపడుతున్నారని అతని సన్నిహితులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఓ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడన్న దాన్ని విశ్లేషించే ఓ వీడియోను అశుతోష్ భక్రే తాను చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడి మరణంపై ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అశుతోష్ భక్రే మృతితో మరాఠీ సినిమా పరిశ్రమలో విషాదం అలుముకుంది.