Home తాజా వార్తలు ‘మర్దానీ-2’ ట్రైలర్ పై ప్రశంసలు..

‘మర్దానీ-2’ ట్రైలర్ పై ప్రశంసలు..

 

బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మార్దానీ-2’. ఈ చిత్రం అత్యాచారాలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా గోపి పుత్రన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఆదిత్యా చోప్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాణీ ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ యూట్యూట్ లో ట్రెండింగ్ నిలిచింది. ఇందులో ఓ దుండగుడు చిన్నారులను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతూ.. వారిని హత్య చేస్తుండడం, ఆపై పోలీసులకు సవాల్ విసురుతుండడం వంటి సీన్లను ఎంతో ఉత్కంఠగా చూపించారు. ఈ ట్రైలర్ లో రాణి ముఖర్జీ నటన అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు, విమర్శకులు ప్రంశసలు కురిపిస్తున్నారు. టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.ఇక, ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Mardaani-2 Official Trailer released