Home తాజా వార్తలు భారీ మొత్తంలో గంజాయి … రెండు తుపాకులు స్వాధీనం

భారీ మొత్తంలో గంజాయి … రెండు తుపాకులు స్వాధీనం

Marijuana And Two Gunsవరంగల్ రూరల్ : గీసుకొండ మండలం కీర్తీనగర్ కాలనీలో అక్రమంగా  నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల గంజాయితో పాటు రెండు తుపాకులను, 11 లైవ్ రౌడ్లను  స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచిన సుమన్‌ అనే యువకుడిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గంజాయి, ఇతర మత్తు మందులు విక్రయించే వారి గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.

Marijuana And Two Guns Seized In Geesugonda