Home తాజా వార్తలు అశ్వారావుపేటలో గంజాయి పట్టివేత

అశ్వారావుపేటలో గంజాయి పట్టివేత

Marijuana

 

అశ్వారావుపేట: అశ్వారావుపేట పోలీసులు కారులో రవాణా అవుతున్న రూ 30లక్షల గంజాయిని సోమవారం తెల్లవారుఝామున పట్టుకున్నారు. సుమారు 2క్వింటాళ్లున్ను 40 ప్యాకెట్లు గంజాయి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు రవాణా అవుతుండగా పట్టుబడింది. దీనికి సంబంధించిన వివరాలను స్దానిక స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్వంచ డిఎస్పి కెఆర్‌కె ప్రసాద్ , సిఐ అబ్బయ్యలు వెల్లడించారు. గంజాయి రవాణా అవుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు అశ్వారావుపేట పోలీసులు సోమవారం తెల్లవారుఝామున వాహనాల తనఖీ చేస్తుండగా రెండుకార్లు వేగంగా వెళుతున్నాయి.

వాటి ఆపి తనిఖీ చేయగా , ఒక డిఎల్ 4సి ఏబి 5309 కారుకు రాంగ్ నంబర్ ప్లేట్ ఏపి 09 బిఎన్ 8660 నంబర్ అమర్చి ఉంది. దానిలో ముగ్గురు వ్యక్తులున్నారు. వారు ఢిల్లీకి చెందిన విపుల్ శర్మ, ఎం.డి. రాజు, జార్ఖండ్ లోని గొట్టాకు చెందిన ఎం.డి అష్పాక్ లున్నారు. కారు డిక్కీ తనిఖీ చేయగా 22ప్యాకెట్ల ఎండు గంజాయి లభించింది. పోలీసులు పూర్తీ స్దాయిలో తనఖీ చేయగా పది సెల్ ఫోన్‌లు , ఆరు డెబిట్ కార్డులు లభించాయి. అదే క్రమంలో రెండో కారు డిఎల్ 4 సిఏఈ 5888 గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కారు అక్కడే వదిలేసి పారిపోయారు. వెంటనే పోలీసులు ఆ కారు తనఖీ చేశారు.అందులో 20 ప్యాకెట్లు గంజాయి లభించింది.

రెండుకార్లు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా గత మూడు నాలుగేళ్లు గంజాయిని ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లా లో ఖాన్ , బుల్సన్ అనే వారి నుంచి తుక్కువ ధర కు కొనుగోలు చేసి తమ కార్లలో ఢిల్లీకి తీసుకువెళ్లి కిలో రూ1500చొప్పున అమ్ముతున్నట్లు వెల్లడించారు. గతంలో ఎండి రాజు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడ పోలీసు స్టేషన్‌లో ఇదే కేసులో అరెస్టయినా, ఈ గంజాయి వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇదే పని చేస్తున్నామని నిందితులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ రామ్మూర్తి పాల్గొన్నారు.

Marijuana seized in Aswaraopeta