Home అంతర్జాతీయ వార్తలు ఫేస్ బుక్ కుంభకోణంపై మౌనం వీడిన జుకర్ బర్గ్!

ఫేస్ బుక్ కుంభకోణంపై మౌనం వీడిన జుకర్ బర్గ్!

Face-book-Zukarbarg

ఫేస్ బుక్ ఖాతాదారుల సమాచార చౌర్యంపై ఆ సంస్థ సిఇఒ మార్క్ జుకల్ బర్గ్ స్పందించాడు. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంపై ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న విమర్శలపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ విషయంలో తప్పు జరిగిందని ఆ తప్పును అంగీకరిస్తున్నమని తెలిపారు. రెండు సంస్థల మధ్య సమన్వయం లోపించడం  వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి తప్పులు మరోమారు జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన బర్గ్ ఈ విషయంలో ఫేస్‌ బుక్ తీసుకోనున్నా న్యాయమపరమైన చర్యలపై తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి డాటా చోరీ జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఫేస్‌ బుక్  వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్స్ దుర్వినియోగం చేస్తున్నాయని, వాటి విషయంలో మరికాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ తరహాలో ఉండే అప్లికేషన్లు ఇది వరకే నిషేధించామని సూచించారు. ఫేస్‌ బుక్ డేటా చౌర్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి విధితమే.